బిగ్బాస్ 9 రన్నరప్ తనూజ మంచి మనసు చాటుకుంది. షో ముగియగానే అనాథాశ్రమానికి వెళ్లి చిన్నారులతో సందడి చేసింది. వారితో ఆడిపాడి, స్వయంగా పిల్లలకు కేక్ తినిపించి, అన్నం వడ్డించింది. ఓ చిన్నారికి గోరుముద్దలు తినిపిస్తూ.. వారితో కలిసి భోజనం చేసింది. ‘చాలా రోజుల తర్వాత నా కుటుంబాన్ని కలిసినట్లు ఉంది.. ఇదొక మర్చిపోలేని జ్ఞాపకం’ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.