SRPT: గరిడేపల్లి మండల నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా కొండ సైదులు గౌడ్ ఆదివారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మంజూరుకు కృషి చేస్తానని, అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులతో సమన్వయంగా పనిచేస్తూ జర్నలిస్టుల అభివృద్ధికి తోడ్పడతానని తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా ఎల్లావుల వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు.