NRML: దిలావర్పూర్ గ్రామ సర్పంచ్‌గా ఇటీవల గెలుపొందిన పాల్దే అక్షర అనిల్ ఆధ్వర్యంలో సర్పంచ్, స్థానిక నాయకులు సోమవారం అత్యంత పురాతనమైన కదిలి శ్రీ పాప హరేశ్వర ఆలయానికి మొక్కులు చెల్లించేందుకు పాదయాత్రగా బయలుదేరారు. సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం గ్రామ అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం దేవుని ఆశీస్సులు కోరుతూ పాదయాత్ర నిర్వహించినట్లు వారు తెలిపారు.