ఈ ఏడాది జనవరి-నవంబర్ మధ్య ద.మ. రైల్వేకు రూ.19,314 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. గతేడాదితో పోలిస్తే(రూ.18,831 కోట్లు) ఇది రూ.483 కోట్లు అధికమని పేర్కొన్నారు. రైళ్ల రద్దీని తగ్గించేందుకు చర్లపల్లి టెర్మినల్‌ను అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. మరోవైపు సంక్రాంతి రద్దీ నేపథ్యంలో జనవరి 7-12 వరకు మరో 11 ప్రత్యేక రైళ్ల బుకింగ్ ఇవాళ ప్రారంభం కానుంది.