VSP: గాజువాక డిపో 59 వార్డు నక్కవానిపాలెంలో ఓ బాలుడు ఉరివేసుకొని మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో యుగంధర్ వర్మ (16) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గాజువాక పోలీసులు ఘటనస్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. బాలుడి అత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.