MLG: జిల్లాలో మరోసారి పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. BHPL అటవీ ప్రాంతం నుంచి వచ్చిన పులి నిన్న రాత్రి జాకారం వద్ద రోడ్డు దాటుతూ నర్సరీలోకి వెళ్లింది. ఈ దృశ్యాన్ని అంబులెన్స్ డ్రైవర్ గమనించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న MLG ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ డోలి శంకర్ బీట్ టీమ్‌తో కలిసి నర్సరీ వద్ద పులి అడుగులను గుర్తించారు.