PLD: రెవెన్యూ క్లినిక్స్ ద్వారా ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నరసరావుపేట జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్స్‌ను సోమవారం ప్రారంభించారు. ప్రజా సమస్యలకు, ముఖ్యంగా భూ సంబంధిత ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం అందించడమే తమ లక్ష్యమని ఆమె తెలిపారు.