WGL: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల పై ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మంది ఎమ్మెల్యేల్లో 11 మంది అధికార కాంగ్రెస్లో ఉన్నప్పటికీ.. నియోజకవర్గ సమస్యల పై వారు ‘అధ్యక్షా’ అంటూ గళమెత్తుతారా అని ప్రజానీకం ఎదురుచూస్తోంది.