W.G: గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. పండుగ నేపథ్యంలో పలుచోట్ల కోడి పందేల నిర్వహణకు బరులను సిద్ధం చేస్తున్నారు. అధికారిక అనుమతులు రాకముందే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే వీరవాసరం, ఆకివీడు, భీమవరం మండలాల్లో పందేలను నివారించాలంటూ స్థానికులు అధికారులకు వినతిపత్రాలు అందజేస్తుండటం గమనార్హం.