CTR: పుంగనూరు మండలంలో రేపు (మంగళవారం ) రెవిన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు MRO రాము తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సింగరిగుంట, మేళం దొడ్డి పంచాయతీలలోని సచివాలయం వద్ద ఈ సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. రెవిన్యూ భూముల రీ సర్వే ఉంటుందని రైతులు తప్పక హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.