ATP: గుత్తికి చెందిన విద్యార్థి అభిరామరాజు గోల్డ్ మెడల్ సాధించినట్లు తైక్వాండో మాస్టర్ తేజ సోమవారం మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. తెనాలిలో రెండు రోజుల పాటు రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు జరిగాయన్నారు. అందులో అభిరామరాజు ప్రతిభ కనబరచడంతో నిర్వాహకులు గోల్డ్ మెడల్ ప్రదానం చేశారు. ఈ మేరకు అతడిని బంధువులు, తోటి విద్యార్థులు అభినందించారు.