PDPL: గోదావరిఖని పట్టణంలో సోమవారం తెల్లవారుజామున వివిధ కూడళ్ళలో పోలీసులు నాకాబంది నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలను తనిఖీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రామ్ రెడ్డి, ఎసీపీ రమేష్, సీఐ ఇంద్రసేనారెడ్డి, సుమారు 100 మంది సిబ్బంది ఈ నాకాబందిలో పాల్గొన్నారు.