ATP: తాడిపత్రిలోని చారిత్రక క్షేత్రం శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు స్వామివారిని పుష్పాలు, విశేష ఆభరణాలతో సుందరంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఏకాదశి సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మారుమోగింది.