మెక్సికోలో రైలు పట్టాలు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 13 మంది మృతిచెందగా.. 98 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. పసిఫిక్ సముద్రం-గల్ఫ్ ఆఫ్ మెక్సికోను కలిపే లైనుపై ఓక్సాకా-వెరాక్రూజ్ మధ్యలో ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో రైల్లో 250 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఆ దేశ అటార్నీ జనరల్ ఆఫీసు దర్యాప్తు జరుపుతోంది.