WGL: డెస్క్ జర్నలిస్టులకు బస్ పాస్లు, సంక్షేమ పథకాలు వర్తింపజేసేలా కృషి చేస్తామని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ తెలిపారు. 252 జీవోపై వస్తున్న అవాస్తవాలను నమ్మవద్దని కోరారు. అర్హులైన ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు అందడమే తమ ధ్యేయమని, విలువలతో కూడిన జర్నలిజం కోసమే ప్రభుత్వం కొత్త నిబంధనలు తెచ్చిందని ఆయన స్పష్టం చేశారు.