ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ హ్యూగ్ మోరిస్(62) కన్నుముశాడు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న మోరిస్ నిన్న మృతిచెందాడు. సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించిన గ్లామోర్గాన్ కౌంటీ జట్టు ప్రకటనలో సంతాపం తెలిపింది. ఆటగాడిగానే కాకుండా.. సీఈవో గానూ క్లిష్ట పరిస్థితుల్లో క్లబ్‌ను ఆర్ధిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించినట్లు అందులో పేర్కొంది.