VSP: ఎలమంచిలి రైల్వే ప్రమాదం నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి, రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులను కోరారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు.