KNR: రబీ సీజన్ పంటలకు అవసరమైన యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. గన్నేరువరం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ఆదివారం 340 యూరియా బస్తాలు వచ్చాయి. సమాచారం తెలుసుకున్న రైతులు బారులు తీరారు. యూరియా కోసం నానా తంటాలు పడుతున్నామని, గత సీజన్లో యూరియా లేకపోవడంతో పంటలు సరిగా పండలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.