MHBD: జిల్లా వ్యాప్తంగా రైతులు యూరియా కోసం పడుతున్న కష్టాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నూతన యూరియా బుకింగ్ యాప్ ప్రవేశపెట్టిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయనిర్మల తెలిపారు. ప్లే స్టోర్లో “ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్” డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ యాప్ ద్వారా రైతులు ఇంటి నుంచే బుకింగ్ చేసి 24 గంటల్లోపు ఎరువులు తీసుకోవచ్చని సూచించారు.