MBNR: జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ (38) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. విధుల్లో అందరితో స్నేహపూర్వకంగా ఉండే ప్రవీణ్ అకాల మరణం పట్ల తోటి ఉద్యోగులు, అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక మంచి మిత్రుడిని కోల్పోవడం తీరని లోటని వారు ఆవేదన వ్యక్తం చేశారు.