HYD: వేరువేరు విభాగాల ఆధ్వర్యంలో ఉన్న వరదకు సంబంధించిన నాలాలన్నింటిని ఒకే విభాగం కిందికి తీసుకొచ్చినట్లు జీహెచ్ఎంసీ తెలిపింది. అన్ని నాలాలను SNDP విభాగానికి అప్పగించాలని ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆరు నెలల క్రితమే జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం సర్వే ప్రారంభమై తుది దశ పూర్తయింది. త్వరలో సమగ్ర నివేదిక సిద్ధం కానుంది.