GNTR: పెదకాకానిలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ‘సంకల్పం’ అవగాహన కార్యక్రమం జరిగింది. ఎస్ఐలు రామకృష్ణ, మీరజ్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించిన ఈ కార్యక్రమంలో, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. సమాజ శ్రేయస్సు కోసం డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.