సంతాన ప్రాప్తి కోసం, పిల్లల క్షేమం కోసం ఎదురుచూసే దంపతులకు ‘పుత్రదా ఏకాదశి’ ఒక వరం లాంటిది. ఇవాళ శ్రీ మహావిష్ణువును భక్తితో పూజించడం, ఉపవాసం ఉండడం వల్ల సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని, ఉన్నవారి పిల్లలకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. దీనిని ‘పుత్రులను ప్రసాదించే ఏకాదశి’ అని కూడా అంటారు.