ELR: జంగారెడ్డిగూడెం శ్రీ గోకుల తిరుమల పారిజాత గిరి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ పవిత్రమైన రోజున స్వామివారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.