AP: ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లాల్సిన ఉదయ్ ఎక్స్‌ప్రెస్, పూరీ-తిరుపతి, ఈస్ట్‌కోస్ట్, బెంగళూరు హంసఫర్, షాలిమార్-చర్లపల్లి(18045), విశాఖ-లింగంపల్లి(12805), విశాఖ-గుంటూరు(17240) ఎక్స్‌ప్రెస్ రైళ్లు 3-4 గంటలు ఆలస్యమయ్యాయి.