KRNL: పత్తికొండకు చెందిన లిఖిత ఏపీ అండర్-15 మహిళా క్రికెట్ జట్టుకు ఎంపికైనట్లు ఆమె తండ్రి రాఘవేంద్రరావు ఆదివారం తెలిపారు. చిన్న వయసులోనే కఠిన సాధనతో రాష్ట్రస్థాయి జట్టుకు చేరడం ఆమె ప్రతిభకు నిదర్శనమన్నారు. లిఖిత భవిష్యత్తులో జాతీయ స్థాయిలో సత్తా చాటాలని పత్తికొండ ప్రజలు ఆకాంక్షిస్తూ, అభినందనలు తెలిపారు.