KMM: కామేపల్లి మండలంలో సోమవారం నుంచి యూరియా అమ్మకాలను పూర్తిగా ‘ఫర్టిలైజర్ బుకింగ్’ యాప్ ద్వారానే నిర్వహించనున్నట్లు మండల వ్యవసాయాధికారి భూక్యా తారాదేవి తెలిపారు. గత వానాకాలం సీజన్లో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం ఈ నూతన విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. దీనివల్ల యూరియా పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు.