ADB: భీంపూర్ మండలంలోని కరంజి (టీ) అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అయ్యప్ప స్వాములు స్వామివారికి అర్చన, అభిషేకము, మెట్ల పూజ చేశారు. సంస్కృతిక, భక్తి పాటలకు అనుగుణంగా కొనసాగిన పూజ కార్యక్రమాలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.