AP: శ్రీవారి దివ్యక్షేత్రం తిరుమల వైకుంఠ ఏకాదశిని పురష్కరించుకుని సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇవాళ అర్ధరాత్రి దాటాక శ్రీవారి ఆలయాన్ని తెరవనున్నారు. స్వామివారికి అర్చకులు పూజా కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహించిన అనంతరం.. 1:30 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరచుకోనున్నాయి. జనవరి 8న రాత్రి 12 గంటల వరకు, మొత్తం పది రోజులపాటు ఈ దర్శనం కల్పించనున్నారు.