TPT: గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో హర్ష టయోటా షోరూమ్ పక్కన రోడ్ విస్తరణ పనుల సమయంలో క్రేన్ గ్యాస్ పైప్‌లైన్‌ను తాకడంతో లీకేజ్ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని పరిసరాలను ఖాళీ చేసి ట్రాఫిక్ నియంత్రించి లీకేజ్‌ను అదుపులోకి తెచ్చారు. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సూచించారు.