W.G: పెంటపాడు గోయెంకా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన యూటీఎఫ్ జిల్లా కౌన్సిల్ ఎన్నికల్లో రామానుజరావు రాష్ట్ర కౌన్సిలర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరవాసరానికి చెందిన ఆయన ప్రస్తుతం బంటుమిల్లి మోడల్ పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా విధి నిర్వహణలో ఉన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.