KRNL: తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పూర్తిగా నిలిచిందని టీబీ అధికారులు తెలిపారు. ఆదివారం ఎలాంటి ఇన్ ఫ్లో కొనసాగలేదన్నారు. ప్రస్తుతం జలాశయం నుంచి వివిధ కాల్వలకు, నదికి కలిపి 8,999 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయ నీటిమట్టం 1,611.15 అడుగులకు గాను 39.89 TMCల నీటి నిల్వ ఉందన్నారు. జనవరి 10న కాల్వలకు నీరు నిలిపివేస్తామని అధికారులు తెలిపారు.