AP: గుంటూరు జిల్లా తెనాలి ఆర్ట్ గ్యాలరీలో 20 టన్నుల ఇనుప వస్తువులతో 6.5 అడుగుల ఎత్తుతో రూపొందించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 21.5 అడుగుల ఎత్తు, 18 అడుగుల వెడల్పుతో మండపం, అందులో 8 అడుగుల సింహాసనంపై ఈ విగ్రహాన్ని తయారుచేశారు. మొత్తం రూ.35 లక్షలు ఖర్చయిందని, రీ-సైక్లింగ్ వస్తువులతో తయారుచేయడం ద్వారా సామాజిక సందేశాన్ని అందించామని శిల్పులు వివరించారు.