TG: రానున్న రెండు రోజులపాటు చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదు కానున్నట్లు పేర్కొంది. దీంతో ఆదిలాబాద్, మెదక్, నిర్మల్, సిద్దిపేట సహా సంగారెడ్డి జిల్లాకు ఆరెంజ్.. HYD, జగిత్యాల, వరంగల్, హనుమకొండ, జనగామ సహా రంగారెడ్డి జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.