KMM: ఖమ్మం జూబ్లీ ఆఫీసర్స్ క్లబ్ ఎన్నికలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో సెక్రటరీగా మోత్కూరి నాగేశ్వరరావు ఘనవిజయం సాధించారు. తన గెలుపునకు సహకరించిన ఆఫీసర్స్ క్లబ్ సభ్యులకు, ఓటు వేసి గెలిపించిన వారికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. క్లబ్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.