NZB: జుక్కల్ సెగ్మెంట్ పిట్లం మండలం హస్నాపూర్ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. మూలమలుపు వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడటంతో చిల్లర్గి గ్రామానికి చెందిన మరియవ్వకు గాయాలయ్యాయి.స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించడంతో,సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలికి ప్రథమ చికిత్స చేసి,మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.