ADB: బేల మండలం సిర్సన్న వద్ద ఆదివారం రాత్రి ప్రమాదానికి గురైన ద్విచక్ర వాహనదారుడికి రోడ్ సేఫ్టీ క్లబ్ సభ్యులు ఫస్ట్ ఎయిడ్ కిట్ ద్వారా ప్రథమ చికిత్స అందజేశారు. రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణ నష్టం తగ్గించేందుకు ప్రవేశపెట్టిన రోడ్ సేఫ్టీ క్లబ్ విధానాన్ని SP అఖిల్ మహాజన్ ఇటీవల ప్రారంభించారు. ఈ మేరకు రోడ్ సేఫ్టీ క్లబ్ సభ్యులను SP అభినందించారు.