VZM: ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఆదివారం ఆకస్మిక డ్రోన్ సర్వే నిర్వహించారు. డ్రోన్ సర్వేలో బహిరంగ మద్యం సేవిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. ఇకమీదట పోలీసు స్టేషన్ పరిధిలో శివారు ప్రాంతాలను ఎంచుకొని డ్రోన్ సర్వే విస్తృతం చేసి, నిఘా పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.