GNTR: గుంటూరు జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు పెంచే లక్ష్యంతో, ఎన్నారై దంపతులు బండారు అశోక్ కుమార్, జయలక్ష్మి పెదకాకానిలో ఒక అత్యాధునిక నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయమై ఆదివారం వారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను కలిసి చర్చించగా, ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని మంత్రి సానుకూలంగా హామీ ఇచ్చారు.