AP: ‘నేను ఆంధ్రా కోడలిని.. పీఎం లంక కుమార్తెను’ అంటూ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి(D) పెదమైనవాని లంకలో ‘సైయెంట్ ఏఐ, ఫ్యూచర్ స్కిల్హబ్’ను ఆమె ప్రారంభించారు. రాష్ట్రంలో యువత AI నేర్చుకోవాలంటే ఇక్కడికి రావాల్సిందేనన్నారు. డ్రోన్ శిక్షణ, స్మార్ట్ క్లాసుల సౌకర్యాలతో యువతకు, రైతులకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు.