చిన్నారులతో సహవాసం అంటే కేవలం వారితో కలిసి కూర్చుని టీవీ చూడటం కాదు. వారితో కలిసి గెంతుతూ, ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ, నవ్వులు పంచుకుంటూ వాళ్లతో మమేకమై ఆనందంగా గడపడమే అసలైన సహవాసం. తల్లిదండ్రుల సాన్నిహిత్యం పిల్లలకు అత్యంత గొప్ప భద్రతా భావాన్ని కలిగిస్తుంది.