కృష్ణా: ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలోని శ్రీకాకులేశ్వర స్వామి ఆలయంలో 30వ తేదీ మంగళవారం వైకుంఠ ఏకాదశిని ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్తర ద్వార దర్శనం, సహస్రనామార్చన, తీర్థ ప్రసాద వితరణ ఉదయం 10 గంటలకు ఆస్థాన పూజ అనంతరం గరుడ వాహన సేవతో గ్రామోత్సవం జరుగుతుంది. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు, తాగునీరు, ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, విద్యుత్ దీపాలు, పుష్పాలంకరణ ఏర్పాట్లు చేసినట్లు నిర్వహకులు తెలిపారు.