KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం హుండీ లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశామని మేనేజర్ ఎస్.కే శ్రీనివాసరావు తెలిపారు. పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామీజీ ఆదేశాల మేరకు డిసెంబర్ 9 నుంచి 28వ తేదీ (20 రోజుల) వరకు హుండీలను లెక్కిస్తున్నట్లు పేర్కొన్నారు. సోమవారం ఉదయం హుండీల లెక్కింపును ప్రారంభిస్తామని చెప్పారు.