ASF: ఎన్నికల కోడ్ ముగియడంతో నేటి (సోమవారం) నుంచి ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో ప్రజావాణి కార్యక్రమం యథాతథంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ప్రకటనలో తెలిపారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి తమ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.