AP: ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలు అగ్నిప్రమాదం ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ఘటనాస్థలాన్ని అనకాపల్లి SP తుహిన్ సిన్హా పరిశీలించారు. ‘ఈ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి విశాఖ వాసి. పెద్ద వయసుకావడంతో ఆయన బయటకి రాలేకపోయారు. మృతుడి బంధువులకు సమాచారం ఇచ్చాం. క్షతగాత్రులకు వైద్య పరీక్షలు చేయించాం. మరో ట్రైన్లో వారిని ఎర్నాకుళం పంపించాం’ అని SP వివరించారు.