SS: మడకశిర మండలంలోని గుండుమల గ్రామంలో ఇవాళ ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించనున్నట్లు పశుసంవర్ధక శాఖ ఏడీ అమర్ తెలిపారు. ఈ శిబిరంలో పశువులకు సంబంధించిన సాధారణ వ్యాధులకు చికిత్సలు, గర్భకోశ సమస్యలపై సేవలు అందిస్తామని చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.