MNCL: బెల్లంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం రాత్రి ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడిని బీహార్ రాష్ట్రానికి చెందిన అనిల్ చౌదరిగా గుర్తించారు. జీఆర్పీ ఎస్సై సుధాకర్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ కెంసారం సంపత్ మృతదేహాన్ని బెల్లంపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. మృతుడి వివరాల కోసం 8328512176ని సంప్రదించాలన్నారు.