NTR: విజయవాడ శాంతినగర్‌లోని ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార వ్యాపారాన్ని మాచవరం పోలీసులు ఆదివారం బయటపెట్టారు. స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించగా, ముగ్గురు మహిళలు, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో నిర్వాహకురాలిగా గుర్తించిన రమణమ్మపై కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.