JN: జిల్లాలో నెలకొన్న విద్యారంగ సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తాలని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ జిల్లా కమిటీ నాయకులు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని కోరారు. ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందించారు. నేటి నుంచి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన, ఫీజుల నియంత్రణ అంశాలపై చర్చించాలని విన్నవించారు.