బాపట్ల మండలం జిల్లెళ్ళమూడి గ్రామంలోని శ్రీ విశ్వ జనని పరిషత్ ట్రస్ట్ ఆవరణలో నిర్వహించిన 44వ జాతీయస్థాయి యోగాసనా ఛాంపియన్షిప్ పోటీల ముగింపు కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పాల్గొన్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు. యోగా ద్వారా శారీరక-మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు.